
అక్బరుపేట భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు అక్బరుపేట భూంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గజబింకర్ అశోక్, మెడికల్ ఆఫీసర్ సాయి తేజస్విని ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది కరుణాకర్, నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.