మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ 

Distribution of fry to fishermenనవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మత్స్యకారుల సంఘం సభ్యులు అన్నారు. మంగళవారం కటేపల్లి,పెద్దకొడప్ గల్ గ్రామాలలోని చెరువులో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో చేశారు ఈ సందర్భంగా మత్స్యకరుల సంఘం సభ్యులు  పలువురు మాట్లాడారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం రాయితీపై చేప పిల్లలను విడుదల చేస్తోందని గత ప్రభుత్వాలు కూడా రాయితీలపై మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేయడంతో జీవనం సాగించుకున్నామని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా మత్స్యకారులకు రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరమని కులవృత్తులకు ప్రభుత్వాలు ఇలా ఆదుకుంటే రుత్తిపై ఆధారపడిన వాళ్లు జీవనం సాగించడం చాలా తేలికవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.