నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం తాడు బిలోలి గ్రామంలో గ్రామంలో మంగళవారం పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను పంపిణీ చేసినట్లు పశు వైద్య అధికారి డాక్టర్ విట్టల్ తెలిపారు. గ్రామంలో 295 తెల్లజాతి పశువులు, 145 నల్లజాతి పశువులకు టీకాలను పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ పశువైద్యాధికారులు నాగరత్న, గంగరాజు, సిబ్బంది సావిత్రి లక్ష్మణ్, గోపాల్ మిత్ర భాస్కర్ గౌడ్, యశ్వంత్, స్థానిక రైతులు పాల్గొన్నారు.