పోల్కంపల్లిలో పచ్చడి పంపిణీ

నవతెలంగాణ-రంగారెడ్ది ప్రతినిధి
క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని సీపీ ఐ(ఎం) పోల్కంపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామ చౌరస్తాలో పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మండల అధ్యక్షురా లు పి.మున్ని, మండల కమిటీ సభ్యు లు సిహేచ్‌. నర్సింహా, గ్రామ కార్యద ర్శులు అశోక్‌, నర్సింహా, వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు నూతన ఏడాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సంవ త్సరం ప్రజలందరూ సుఖ సంతో షాలతో ఆయురారోగ్యాలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం అందరి జీవి తాల్లో కొత్తదనాన్ని నింపాలని ఆకాంక్షించారు. జీవితం లో చేదు తగ్గి తీపి పెరగాలని క్రోది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలి యజేశారు. ఈ కొత్త సంవత్సరం కల లన్నీ నెరవేరాలని, అనుకున్నది సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు పి.శేషి రేఖ, ప్రజా నాట్యమండలి నాయకులు ధనేశ్వర్‌, నాయకులు ఇస్తారి, నర్సింహా, వెంకటేష్‌, యాదగిరి దానయ్య, పాం డు, మాజీ వార్డు సభ్యులు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.