
కాంగ్రెస్ శ్రేణులు ‘ఇంటింటికి కాంగ్రెస్ – గడపగడపకు కాంగ్రెస్’ ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్థానికంగా అర్హులైన పేదలందరకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుందన్నారు. మంగళవారం ఆ పార్టీ మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ఆదేశాలతో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజు,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలం కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివ వేణు ల అధ్యక్షతన సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపూరి కాలనీ, విరాట్ నగర్ బూత్ నెంబర్ 215,216 లలో గల గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీల గ్యారెంటీ కార్డులను ప్రతి ఇంటికి అందజేసి, సొంత స్థలంలో ఇండ్లు కట్టుకొనే వారికి 5లక్షల రూపాయలతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, స్థానిక ప్రభుత్వ హాస్పటల్ వెనక గల ప్రభుత్వ స్థలంలో ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. సింగరేణిలో స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని తెల్పుతూ వచ్చే ఎన్నికలలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోళ్ళ అప్పారావు, వెలిసాలి వెంకట చారీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు హలావత్ వెంకటేశ్వర్లు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి మున్వర్ హుస్సేన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట రాజేష్, జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఎస్సీ సెల్ అధ్యక్షులు, రాయల కోటేశ్వరరావు, బీసీ సెల్ నాయకులు వాసు, బాల చెన్నారావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కనపర్తి కుమారి, సత్తుపల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొంతు సరోజిని తదితరులు పాల్గొన్నారు.