ఐడి కార్డులు, బెల్టులు వితరణ..

Distribution of ID cards, belts..నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు భూపాలపల్లి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ ఐడి కార్డులు, బెల్టులు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలన్న పాఠశాల ఉపాధ్యాయుల కోరిక మేరకు తన వంతు సహాయాన్ని అందించినట్లుగా తెలిపారు. భవిష్యత్తులో పాఠశాలకు అవసరమైన ప్రతివాటికి తన వంతుగా సాయం అందిస్తానన్నారు.పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ లక్ష్మణ్ బాబు, వల్లెంకుంట కాంప్లెక్స్ హెచ్ఎం సుదర్శన్, ,వల్లెంకుంట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రమేష్ నాయక్, ఉపాధ్యాయులు గంగరాజు, మహిపాల్,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సునీత, ఎడ్లపల్లి మాజీ ఉప సర్పంచ్ రాజేశ్వర్ రావు, ఉపాధ్యాయులు.విద్యార్థులు పాల్గొన్నారు.