
ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసి గిరిజన జాతర మేడారం మహా జాతర. ఈ మేడారం మహా జాతర విజయవంతానికి స్థానిక యువత ఎంతో కీలకం. గురువారం పస్రా సిఐ శంకర్, స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి లు, జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు మేడారం గిరిజన అభ్యుదయ సంఘానికి ఐడెంటి కార్డులు (పాసులు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారం మహా జాతర విజయవంతానికి యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చేటప్పుడు కన్నెపల్లి నుండి సార్లమ్మను తీసుకువచ్చేటప్పుడు, కొండాయి నుండి పూనుగొండ్ల నుంచి గోవిందరాజు, పగిడిద్ధరాజు లు గద్దెల పైకి తీసుకువచ్చేటప్పుడు యువత పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. యూత్ నాయకులు విధులు నిర్వహించేటప్పుడు ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఎదురు కాకుండా ఐడెంటి కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆదివాసీ యువత పాసులను సద్వినియోగం చేసుకొని జాతర విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన బోజా రావు, యూత్ సభ్యులు గడిగా అనిల్, సిద్దబోయిన రాణా రమేష్, కొక్కెర పూర్ణచందర్, సమ్మారావ్, ఆలం శంకర్ తదితర 170 మంది ఆదివాసి యూత్ నాయకులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.