క్రీడాకారులకు జెర్సీల వితరణ..

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన క్రికెట్ క్రీడాకారులకు కాంగ్రెస్ బీసీ సెల్ మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్ సోమవారం జెర్సీల వితరణ చేశారు.క్రీడాకారులకు తోడ్పాటున అందించాలనే సదుద్దేశ్యంతో తన వంతుగా జెర్సీల అందజేసినట్టు శ్రీకాంత్ తెలిపారు.జెర్సీల వితరణ చేసిన శ్రీకాంత్ కు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు.