కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం లాంటిదని మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మద్నూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుమంతు యాదవ్ తెలిపారు. మద్నూర్ మండలానికి 130 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పథకాలు నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు వరం లాగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయ ఆవరణంలో గ్రామాల వారీగా నాయకులు ప్రజాప్రతినిధులు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాజా మాజీ సర్పంచ్ విట్రల్ గురూజీ కొడిచర సంజు పెద్ద ఎక్లారా మహేష్ మద్నూర్ అమూల్ షిండే సాయిలు రాములు పాల్గొన్నారు.