మండలంలోని పలు గ్రామాలలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు జుక్కల్ మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం నాడు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెందేగాం, మాదాపూర్ గ్రామాలలో ఏర్పాటుచేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమాలలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకుల చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులనుదశించి మాదాపూర్ నాయకుడు రాజు పటేల్ మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేయడం వలన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకం ఏర్పడిందని, గ్రామాలలో మౌలిక వసతలను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులతో పాటు మండల నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.