నవతెలంగాణ పరకాల: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, డి ఆర్ డి ఓ స్పెషల్ ఆఫీసర్ వేదవతి సాక్షిగా సంగెం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన అధికారిక కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించిన అధికారులు. వేదిక మీద కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ఆశీనులవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది.ఇది అధికారిక కార్యక్రమా? లేక పార్టీ మీటింగ్ గా? అని చర్చించుకోవడం జరిగింది.