కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ..

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని వివిధ గ్రామాల పేదింటి ఆడపిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయంగా అందిస్తున్న కల్యాణ లక్ష్మి చెక్కులను మంగళవారం ఉప్పునుంతల మండల రెవెన్యూ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన కాంగ్రెష్ పార్టీ మండల అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వెల్టూరి రేణయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి రాత్లావత్ కృష్ణ, శేఖర్ గౌడ్, నాయకులు శేఖర్ యాదవ్, నందన చారి,ప్రశాంత్ రెడ్డి, మధు రెడ్డి,  మండల అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ అబ్రహర్ తదితరులు పాల్గొన్నారు.