
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక ప్రజాప్రతినిధులతో శనివారం పంపిణీ చేశారు. అనంతరం గుండారం, బెజ్జంకి క్రాసింగ్, ముత్తన్నపేట గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కవిత,అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.