మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, తహసీల్దార్ మహమ్మద్ యూసుఫ్ చేతుల మీదుగా మంగళవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాధిముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మహమ్మద్ యూసుఫ్ మాట్లాడుతూ… ఏర్గట్ల గ్రామానికి 10,బట్టాపూర్ కు 1,దోంచందకు 3,గుమ్మిర్యాల్ కు 3,తడపాకల్ కు 3,తాళ్ళ రాంపూర్ కు 2,తొర్తికి 1 చొప్పున చెక్కుల రాగా వాటిని లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఇందులోభాగంగా కాంగ్రేస్ నాయకులు ఆడేం గంగాప్రసాద్,రవి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.