ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయల ఎల్ ఓ సి చెక్కు పంపిణీ

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రానికి చెందిన షేక్ సమీనా బేగం ఆరోగ్యం బాగా లేనందున నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్సడ నిమిత్తం ఎమ్మెల్యే జాజాల సురేందర్ సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల రూపాయలు ఎల్ఓసిని సమినాబేగంకుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. దీనికిగాను సమీనా బేగం మరియు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సురేందర్ సర్పంచ్ మమ్మాయిసంజీవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈకార్యక్రమం లో సొసైటీ చెర్మెన్ సాయికుమార్, గాంధారి సర్పంచ్ మామ్మాయి సంజీవ్ యాదవ్, రైతు సమితి అధ్యక్షుడు మనోహర్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివాజీ రావు తదితరులు పాల్గొన్నారు.