
ఇంటి పెద్దదిక్కులేని పేదింటి ఆడబిడ్డ వివాహానికి పుస్తె మెట్టెలు అందజేసి పెళ్లికి తమ వంతు సహకరం అందించడం జరిగిందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో నిరుపేద వధువు బైండ్ల అంజలి వివాహానికి పుస్తే మెట్టెలు, పెళ్లి చీర అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామానికి చెందిన బైండ్ల కవిత-యాదగిరి దంపతుల కూతురు అంజలి వివాహానికి పుస్తె మెట్టెలు అందజేయడం జరిగిందన్నారు. ఈ దంపతులకు కూతూరు, ఒక కుమారుడు ఉన్నారు. అంజలి తండ్రి యాదగిరి 10 సంత్సరాల క్రితమే అనారోగ్యంతో మరణించాడంతో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయారు. అస్సలే నిరుపేద కుటుంబం ఆడబిడ్డ పెళ్ళి చేయాలంటే తలకు మించిన భారంగా ఉంటుంది. అంజలి వివాహానికి ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున పుస్తె మెట్టేలు అందజేయడం జరిగింది.ఇంకా మానవతావాదులు ఎవరైనా ఉంటే నిరుపేద వివాహానికి సహాయం చేయగలరని కోరడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ కోశాధికారి మహమ్మద్ ఉమర్, అయేషా పర్వీన్, గ్రామస్తులు బైండ్ల నరేష్, సుధాకర్, బాబు, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.