
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న జన్మదినం సందర్భంగా గురువారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోగులకు పండ్ల పంపిణీ చేసినారు. మండలంలో ఏ పేద కుటుంబానికి ఆపద వచ్చిన ఆదుకునే అశోక్ జన్మదిన ఈరోజు మండల వ్యాప్తంగా పండగ రోజుగా మారింది. ప్రతి ఒక్కరూ అశోక్ లో ఆశీర్వాదాలు అభినందనలు శుభాకాంక్షల తో తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య గారు , మండల యూత్ అధ్యక్షులు చింత క్రాంతి గారు,మాజీ ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్ గారు,చల్వాయి గ్రామ అధ్యక్షుడు వేల్పుగొండ ప్రకాష్ గారు, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొన్నం సాయి, యూత్ సభ్యులు వడ్డేపల్లి మని, చందు తదితర నాయకులు పాల్గొన్నారు.