ఐసీఐసీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళ సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల మహిళా సంఘాల సభ్యులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. వేల్పూర్, మోర్తాడ్, ఏర్గట్ల, మెండోరా, ముప్కల్ మండలాలకు చెందిన 20 మహిళ సంఘాలకు సుమారు రూ.20 లక్షల విలువైన ఆధునిక వ్యవసాయ యంత్రాలైన రోటవేటర్, సీడ్ డ్రిల్, తైవాన్ పంపులు సబ్సిడీ ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భీంగల్ ఏడిఏ కంభంపాటి మల్లయ్య మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని,నూతన వ్యవసాయ యాంత్రీకరణ వినియోగించుకోవలన్నారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఐసీఐసీఐ ఫౌండేషన్ డివో అఖిల, రాజేష్, సీఎఫ్ చింత శ్రీనివాస్, సాయి, మధు, రాజేష్, మహేందర్, హరీష్, సనుత్న ,మౌనిక, మహిళ సంఘం సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.