విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ ..

Distribution of notebooks and pens to students.నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని వ్యవసాయం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆదివారం విద్యార్థులకు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య చేతుల మీదుగా నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. అంతకుముందు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగం గుండె వంటిదన్నారు.రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషి గొప్పదని అన్నారు.  పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, డైరెక్టర్లు రంజిత్, నవీద్, మహిపాల్, మధులత, రాములు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సుంకెట రవి, నాయకులు బుచ్చి మల్లయ్య, పాలెం చిన్న గంగారాం, పూజారి శేఖర్, సుంకెట శ్రీను, ప్రదీప్, అజార్, మారయ్య, నరేందర్, కార్యదర్శి మెర్సీ, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.