విద్యార్థులకు నోట్ బుక్కుల బహుకరణ

Distribution of note books to studentsనవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట వార్డులో జడ్పీహెచ్ఎస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చీకోటి చంద్రశేఖర్ తన జన్మదిన సందర్భంగా గురువారం పాఠశాల విద్యార్థులకు హెడ్మాస్టర్ ఎండీ సాదత్ అలీ చేతుల మీదుగా నోట్ బుక్కులు,పెన్నులను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైతం బహుమతులు అందజేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయనను హెచ్ఎం సాధత్ అలీ తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ఉపాధ్యాయులు వెంకట కృష్ణమాచారి,కృష్ణమూర్తి,శ్రీనివాస్ రెడ్డి,బాలకృష్ణ,అశోక్,రాజేందర్, దినేష్,సీఆర్పీ నవీన్ ఉన్నారు.