బధిర పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్స్, పండ్ల పంపిణీ

నవతెలంగాణ -ఆర్మూర్ 

రోటరీ క్లబ్బు ఆధ్వర్యంలో అధ్యక్షుడు గోపికృష్ణ వారి అధ్యక్షతన మదర్ థేరిసా  113 వ జయంతి సందర్భంగా  పట్టణంలోని బధిర పాఠశాలలోని విద్యార్థులకు నోట్బుక్స్, పండ్లు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోపి కృష్ణ మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అనే దృక్పథంతో విద్యార్థులు నడుచుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని మదర్ తెరిసా గారి ఆదర్శ భావాలను జీవితంలో అలవర్చుకోవాలని వారు అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజర్ సువర్ణ కిరీటా మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారి సేవలు నేటి విద్యార్థులకు యువత స్ఫూర్తిదాయకమని వారి సేవ ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తులసి పట్వారీ,కోశాధికారి లక్ష్మీనారాయణ పద్మ మురళి, పుష్పకర్ రావు, గోనే దామోదర్ శశిధర్ ,నరేష్, వార్డెన్ మూర్తి పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.