విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ పంపిణీ

– ప్రధానోపాధ్యాయులు లాల్య నాయక్‌
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని కిష్టాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరికీ పాఠశాల నోట్‌ బుక్స్‌ను విద్యార్థులందరికీ పంపిణీ చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు లాల్య నాయక్‌ తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, యూనిఫామ్స్‌, స్కాలర్షిప్‌, మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి సదుపాయం, టాయిలెట్స్‌, ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ మేజర్‌ మైనర్‌ రిపెర్స్‌లు పూర్తి చేయడం జరిగింది. కావున విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందనీ, విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని, ప్రయివేటు పాఠశాలలో లక్షల ఫీజులు కట్టే బదులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.