నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాలలో పగవ తరగతి చదువుతున్న వారికి జుక్కల్ ప్రభూత్వ జూనియర్ కళాశాల అద్యాపకులు కలిసి అట్టా, పెన్నులను ఉచితంగా పంపిణి చేయడం జరిగింది. మంగళ వారం నాడు జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో జూనీయర్ కళాశాల ప్రిన్సిపాల్ అరవింద్ , అద్యాపక బృందం పాల్గోన్నారు. ఈ సంధర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అరవింద్ మాట్లాడుతు పదవ తరగతి పరిక్షలు రాసి పాసైన విద్యార్థలందరు జుక్కల్ ప్రభూత్వ జూనియర్ కళాశాలలో అడ్మీషన్లు తీసుకోవాలని సూచించడం జరిగింది. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు పరిక్ష ప్యాడ్ లు, పెన్నులు అందిస్తామని తెలియచేసారు. అనంతరం కళాశాల అద్యపక బృందానికి జడ్పిహెచ్ఎఎస్ ఉపాద్యాయ బృందం సన్మానించడం జరిగింది.