పట్టణంలో కరపత్రాల పంపిణీ

నవతెలంగాణ – ఆర్మూర్
బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈ తొమ్మిది సంవత్సరాల్లో మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ గురువారం కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని యోగేశ్వర కాలనీ, వెంకటేశ్వర కాలని, హౌసింగ్ బోర్డ్, జెండా గల్లి, కుమ్మరి గైనిలలో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పాలెపురాజు, పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, బీజేపీ పట్టణ కార్యదర్శులు పులి యుగంధర్, గుగులోత్ తిరుపతి నాయక్, బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షులు సాయినాథ్ రెడ్డి, పెద్దోళ్ల భరత్, గిరిజన మోర్చ పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.