నవతెలంగాణ – ముత్తారం: వన మహోత్సవంలో భాగంగా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో ఇంటింటికి నాలుగు చొప్పన వివిధ రకాల మొక్కలను గ్రామ కార్యదర్శి స్వప్న గురువారం పంపిణీ చేశారు. పంపిణీ చేసిన మొక్కలను నాటి, అవి చెట్లుగా పెరిగేంత వరకు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. అదేవిధంగా వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులు తగిన జాగ్రత్తలను పాటించాలని సూచించారు.