నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆట వస్తువుల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పది గ్రామ పంచాయతీలకు గ్రామాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలకు అవసరమైన ఆట వస్తువుల కిట్లను అందజేశారు. ఆయా గ్రామాల సర్పంచ్ లకు ఎంపీపీ అధ్యక్షురాలు లూలకు గౌతమి ఆట వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ రెడ్డి, సర్పంచ్ లు గడ్డం స్వామి, మారు శంకర్, ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, మండల కో ఆప్షన్ సభ్యులు అజ్మత్ హుస్సేన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, నాయకులు ఏనుగు రాజేశ్వర్, పాలెపు రవి కిరణ్, లోలపు సుమన్, ఏనుగు గంగారెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.