– ఆడపిల్ల బరువు కాదు ఆడపిల్ల బహుమానం హితవు
నవతెలంగాణ -దుబ్బాక
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో 19 వార్డుకు చెందిన అజ్జ అపర్ణ రాజు దంపతులకు తొలి ఆడబిడ్డ జన్మించింది.ఈ విషయం తెలుసుకున్న కత్తి కార్తిక గౌడ్ ఆదివారం పాప పేరు మీద చేసిన రూ.5000/- రూపాయల పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేశారు.ఈ సందర్భంగా వారు కత్తి కార్తిక గౌడ్ మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ తోబుట్టువుగా పంపిణీ చేసిన బాండ్లను నేడు కత్తి కార్తీక అక్క తోబుట్టువుగా మార్పు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.నియోజవర్గంలో జన్మించిన మొదటి ఆడబిడ్డకు టీం-కార్తిక ఫౌండేషన్ ద్వారా రూ.5000/- రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ వనిత భూమిరెడ్డి,19వ వార్డు కౌన్సిలర్ స్వప్న రాజిరెడ్డి ,గుండవెల్లి ఎల్లారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు , మాజీ జెడ్పీటీసీ అబ్బుల రాజలింగం గౌడ్ , ,మల్లేశం గౌడ్ మల్లేపల్లి మాజీ సర్పంచ్,15వ వార్డ్ కౌన్సిలర్ పల్లె మీనా రామస్వామి , ఐరేని సాయితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.