వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామపంచాయతీ కార్మికులకు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట సిబ్బందికి రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రెయిన్ కోట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ రోమాల ప్రవీణ్ కుమార్, రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళభరణం శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి బొడ్డు రాములు ,గ్రామ శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు, పంచాయతీ కార్యదర్శి రమ, పాల కేంద్రం అధ్యక్షులు కాశరం,ఫౌండేషన్ సభ్యులు సామల్ల కమలాకర్, రోమాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.