పేదలకు రెన్యూ 2 లక్షల దుప్పట్ల పంపిణీ

హైదరాబాద్‌ : ప్రముఖ డీకార్బనైజేషన్‌ సొల్యూషన్స్‌ కంపెనీ అయిన రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌ ‘గిఫ్ట్‌ ఆర్మ్‌త్‌’ 9వ ఎడిషన్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా 2 లక్షల మంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేసినట్లు తెలపింది. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చలికాలంలో మద్దతును ఇచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో 19,000 దుప్పట్లను పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు తాము 6.25 లక్షల దుప్పట్లను అందించామని.. 2025 నాటికి 10 లక్షల దుప్పట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థకు చెందిన సస్టైనబిలిటీ చైర్‌పర్సన్‌ వైశాలి నిగమ్‌ సిన్హా పేర్కొన్నారు.