నవతెలంగాణ- దుబ్బాక రూరల్: అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కాకి పోచవ్వ ఇటీవల మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న యువత బుధవారం వారీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం పంపిణీ చేసినట్లు పోతరెడ్డి పేట గ్రామ యువత తెలిపారు.ఈ కార్యక్రమంలో కాకి గణేష్, బండి సంతోష్ గౌడ్, దమ్మగౌని యాదగిరి గౌడ్, బొమ్మ బాబా గౌడ్, చెక్క నవీన్, ద్యావర మహేందర్, పాతూరి సాయి కిరణ్ గౌడ్, చాకలి రాజేష్, కమ్మరి గణప్రసాద్, చాకలి నిఖిల్, చింతల నితీష్ పాల్గొన్నారు.