నవతెలంగాణ – దామరచర్ల
దామరచర్ల మండల కేంద్రంలో మాల ధారణ చేసిన స్వాములకు గురువారం డాక్టర్ సందాల సదానందం ఆధ్వర్యంలో ఘని షాహిద్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కోదండ రామాలయం లో గురువారం ప్రత్యేక పూజల అనంతరం ఘని షాహీద్ అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఘని చేపట్టిన ఈ కార్యక్రమంలో మత సామరస్యానికి ప్రతీక నిలిచిందని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ,ఆంజనేయ , శివ మాలలు ధరించిన స్వాములు పాల్గొన్నారు.