పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్ వితరణ..

నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని గుండారం ప్రభుత్వోన్నత పాఠశాలకు స్థానికుడు వాసంపెల్లి అశోక్ రెడ్డి జ్ఞాపకార్థంగా సహచర స్నేహితులు రూ.40 వేలు విలువైన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను బుధవారం వితరణ చేశారు.హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య గౌడ్, ప్రధానోపాద్యాయురాలు నాగమణి, ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి, రవి, మిత్రులు సాయి చరణ్, అశోక్, బాబు, మురళి, శేఖర్, రమేష్, అనిల్, నరేష్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.