మండల పరిధిలోని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జ్యోతి తన తండ్రి దాసరి నందం జ్ఞాపకార్థం ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు బతుకమ్మ పండుగ సందర్భంగా బుధవారం చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతిక అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్ లు శోభారాణి, అనిత, సంధ్య, ఆశా కార్యకర్తలు, మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.