వృద్ధ మహిళలకు చీరల పంపిణీ

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో శుక్రవారం హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. స్వయంభు రాజరాజేశ్వర స్వామిని స్థాపించి 18 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భముగా 25 మంది పేద వృద్ధ మహిళలకు ట్రస్టు నిర్వాహకులు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి జగదీశ్వర్( రిటైర్డ్ టీచర్) మాజీ సర్పంచ్ వడ్లూరి సులోచన, పురోహితులు పరశురాములు యాదగిరి స్వామి, మాజీ వార్డు సభ్యులు శ్యాంసుందర్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.