
రెంజల్ మండలం కందకుర్తి, కళ్యాపూర్ గ్రామాలలో చిన్నారులకు స్కూలు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న తలంపుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ చేపట్టిన ఓ ఎన్ జే సి ఆధ్వర్యంలో ఉచితంగా బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ జీ తో సంప్రదించి ఇట్టి బ్యాగులను ఇప్పించడానికి కృషిచేసిన ధరంపూరి అరవింద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అసాద్ బేగ్, కళ్యాపూర్ ఎంపీటీసీ సంయుక్త, కందకుర్తి ఉప సర్పంచ్ దేవుళ్ళ యోగేష్, ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ కరీం, గంగాధర్, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ నిస్సార్ బెగ్ కల్లాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గాండ్ల నాగరాజ్, గంగా దాస్, బాలకృష్ణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.