బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు ఇదే పాఠశాలలో చదివి అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి మర్యాద రుక్మా రెడ్డి, తన సోదరుడు మర్యాద కృష్ణ రెడ్డితో కలసి శనివారం స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేయించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయులు బాలమణి, వెంకటేష్ మాట్లాడుతూ.. పాఠశాల సాధించిన ప్రగతిని, విద్యార్థులు సాధించిన గురుకుల సీట్ల వివరాలను, పాఠశాలలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు, గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక తరగతులు, టి.ఎల్.ఎం తో కృత్యాధార అర్థవంతమైన బోధన వివరాలను తెలియజేసి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ రెడ్డి విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ మేము కూడా ఇదే పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి చేరుకొన్నామని, పాఠ్యపుస్తకాలను భద్రపరచుకోవడాని ఉపయోగపడే స్కూల్ బ్యాగ్ లను పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా ఇవ్వడం సంతోషంగా ఉందని, మీరు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. టీచర్ల కృషిని అభినందించారు. రాంచంద్రయ్య, హెచ్.ఎం నరసింహ రెడ్డి పాల్గొన్నారు.