పాఠశాలలో విద్యార్థులకు స్కూల్  బ్యాగుల పంపిణీ..

నవతెలంగాణ-కుబీర్ : మండలంలోని పార్డి (బి )గ్రామంలోని గురువారం ఎల్బీఎం పాఠశాలలో రాష్ట్రీయ గ్రామీణ సంకల్పిత మిషన్ మరియు తెలంగాణ సాగర సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు మార్క సురేష్ సాగర్ నవీన దంపతులు  ఎల్బీఎం పాఠశాలలో విద్యార్థులకు  ఉచితంగా బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉపాధ్యాయ లు చెప్పిన పాఠాలు శ్రద్దగా విని మంచి ఫలితాలు తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో  అదిలాబాద్ సగర సంఘ కోశాధికారి శంకర్,రఘునాథ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగిశెట్టి వెంకటేశ్వర్  సగర సంఘ సభ్యులు విట్టల్ ,పి.రాజశేఖర్ తదితరులు ఉన్నారు