నవతెలంగాణ – మోర్తాడ్
జాతీయసైన్స్ దినోత్సవ పురస్కరించుకొని స్థానిక జడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ప్రతిభ పరీక్షలు నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ పరీక్షలలో ఏ శ్రీహిత సుంకేట్ ప్రధమ బహుమతి , ద్వితీయ బహుమతి దొనకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల చెందిన కే హారిక బహుమతి పొందినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు రవీందర్ విష్ణువర్ధన్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.