సొసైటీ అధ్వర్యంలో విత్తనాలు పంపిణీ

నవతెలంగాణ-భిక్కనూర్ : సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం సొసైటీ అధ్యక్షులు భూమయ్య జీలుగ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందించడం జరుగుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాయితీ పై అందిస్తున్న జీలుగ విత్తనాలు రైతులు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, నాయకులు మల్లేశం, నర్సింలు, మైపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, సాయిలు, సీఈఓ నరసింహులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.