షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం తాసిల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మండలానికి సంబంధించిన వివిధ గ్రామాలలో 17 కళ్యాణ లక్ష్మి చెక్కులు, 50 షాది ముబారక్ చెక్కులను అందజేయడం జరిగిందనీ తాసిల్దార్ ఎండి ఖలీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ మోబీన్ ఖాన్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్, జి సాయి రెడ్డి, శనిగరం సాయి రెడ్డి, బాబన్న, హాజీ ఖాన్, నీరడి సాయిలు ఎమ్మెల్ రాజు, సద్దాం, ప్రభాకర్, ఇంద్రారెడ్డి, వోడ్డెక్క మోహన్, సాయినాథ్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.