
మండలంలోని ముల్లంగి(బి), మాక్లూర్ గ్రామాలకు గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొర్రెలను లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గొర్రెల పంపిణీ లో బాగంగా మాక్లూర్ గ్రామానికి 5 యూనిట్లు, ముల్లంగి (బి) గ్రామానికి 6 యూనిట్లు వచ్చాయి. ఒక్కో యూనిట్ కు 20 గొర్రెలు, ఒక్క పొట్టేలు లబ్ధిదారులకు అందాయి. ఈ గొర్రెలను కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రాంతం నుంచి లబ్దిదారులు వెళ్లి తీసుక వచ్చారు. ఈ కార్యక్రమంలో పషు వైద్యులు డా. కిరణ్ దేశ్ పాండే, గ్రామ గొర్రె,మేకల సహకారంతో సంఘం అధ్యక్షులు మహేందర్, లబ్దిదారులు, సిబ్బంది పాల్గొన్నారు.