గొర్రెల పంపిణీ వెంటనే అమలు చేయాలి: బండారు నరసింహ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
తెలంగాణ గొర్ల మేకల పెంపకందారుల సంఘం చౌటుప్పల మండల కమిటీ సమావేశం బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కొండే శ్రీశైలం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఏడు నెలలు కావొస్తుందని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి జరిగిందని సాకుతో ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల దొంగతనాలు పెరిగాయని కుక్కల దాడిలో జీవాలు చనిపోయి పెంపకం దారులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు తక్షణం ప్రభుత్వం గొర్ల పెంపకం దారులను ఆదుకోవాలని అన్నారు. ఉచితంగా గొర్రెల బీమా పథకం గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగొర్రెల పథకం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని అశ్వ వైద్య హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఇల్లు లేనటువంటి వారికి ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పై సమస్యల విషయంలో ఆగస్టు 8 తారీఖు నాడు చౌటుప్పల రెవిన్యూ డివిజన్ పరిధిలో సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భీమన గోని బాలరాజు గడగోటి జంగయ్య గుణమోని ఐలయ్య ఏనుగుల యాదయ్య అరిగేబీరప్ప కడగంచి చలమంద రాజు మల్లయ్య నరసింహ రాములు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.