రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

నవతెలంగాణ- ఆర్మూర్
 పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ అధ్యక్షతన పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల పంపిణీ  కార్యక్రమం ఆదివారం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్  కాలనీ వాసులకు  100 గట్టి గణపతులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈరవర్తి రాజశేఖర్ మాట్లాడుతూ నేటి తరం ప్లాస్టిక్ నివారణ పర్యావరణ రక్షణ కాపాడడం కోసం మట్టితో తయారు చేసిన వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు ముందుండి పర్యావరణాన్ని కాపాడాలని వారు అన్నారు. రోటరీ స్వచ్ఛంద సేవలు నేటి తరానికి ఆదర్శమని వారు అభినందించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, ప్రాజెక్ట్ చైర్మన్ స్పాన్సర్ రాస ఆనంద్ , ఖాందేష్ శ్రీనివాస్, ఖందేశ్ సంగీత, రోటరి సభ్యులు  పుష్పక రావు , మహాలింగం శెట్టి, గోనె దామోదర్, కత్రజీ రాజేందర్,గోనె శ్రీధర్, కోట నరేష్, ఖందెష్ సత్యం,వినాయక్ , శశిధర్, హనుమాన్ మందిరం ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు విట్టోబ శేఖర్, నూకల శేఖర్, భాస్కర్, అంబల్ల శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.