రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండగ సందర్భంగా మట్టి గణపతులను స్పాన్సర్ చేసిన తులసి పట్వారి,వినాయక్ లకు రోటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులకు శనివారం అందజేసినవారు. పెర్కిట్ లో గల బొర్ర గణపతి (సంకష్ట గణపతి) ఆలయంలో భక్తులకు పెద్ద ఎత్తున మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగంది. జిరాయత్ నగర్ లో గల హనుమాన్ మందిరంలో మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సంతోషం వ్యక్తం చేసి రోటరీ సభ్యులకు కృతజ్ఞతల తెలిపారు..రోటరీ క్లబ్ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ భక్తులందరూ మట్టి గణపతులను ప్రతిష్ఠినించినట్లైతే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సెక్రెటరీ రాస ఆనంద్,కోశాధికారి శశిధర్,విద్య గోపికృష్ణ , స్పాన్సర్స్ తులసి పట్వార్,వినాయక్ లు,విద్యా ప్రవీణ్,ఖాందేశ్ సత్యం,వన్నెల్ దేవి రాము,ఆలయ కమిటి సభ్యులు విట్టోభ శేఖర్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.