
రోటరి క్లబ్ ఆధ్వర్యంలో యం.పి.పి.యస్,జిరాయత్ నగర్ పాఠశాలకు రూ.6000/- విలువ గల సౌండ్ సిస్టమ్ అధ్యక్షులు రజనిష్ కిరాడ్, రూ.4500/- విలువ గల ఆట వస్తువుల ను పి ఆర్ టి య జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మీ నారాయణ లు శనివారం వితరణ చేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి.లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ రోటరి సేవా సంస్థ ప్రభుత్వ పాఠశాలల సౌకర్యార్ధం వితరణ చేయడం గొప్ప విషయమని,తమ సేవలను కొనసాగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంతోషి రాణి,పీఆర్టీయు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మీ నారాయణ,కౌన్సిలర్ వన్నెల్ దాస్ రాము,రోటరి మాజీ అధ్యక్షులు గోపి కృష్ణ పట్వారి,ప్రవీణ్ పవార్,మాజీ కార్యదర్శి తులసి పట్వారి,పాఠశాల ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.