ఇందూరు తిరుమల క్షేత్రంలో సంతాన ప్రాప్తి కోసం శుక్రవారం రోజున విశేష ఔషధ పంపిణీ

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల క్షేత్రంలో శుక్రవారం రోజున మాఘ పౌర్ణమి. కావున ఆరోజు  పిల్లల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ  ఔషధాన్ని పంపిణీ చేయబడుతుందని, కాకపోతే కచ్చితంగా భార్యాభర్తలు కలిసి రావాలని, అలాగే ఔషధం తీసుకునేవారు ముందుగా వచ్చి ఆలయ ప్రాంగణంలో టోకెన్లు తీసుకోవాలని ఔషధం కోసం వచ్చే జంటలను మాత్రమే గుడిలో పలికి అనుమతిస్తారని ఆలయ కమిటీ తెలపడం జరిగింది. ఈ ఔషధ పంపిణీ కేవలం సంవత్సరానికి ఒకరోజు మాత్రమే పంపిణీ చేయబడుతుందని కేవలం ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులతోనే ఇవ్వడం జరుగుతుందని, భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.