
మండలంలోని పచ్చల నడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థులు మన ఊరు- మన నిధి గ్రూపు సభ్యులు మంగళవారం స్పోర్ట్స్ డ్రెస్సులను వితరణ చేశారు. ఈ సందర్భంగా మన ఊరు- మన నిధి సభ్యులు వొల్లం రవి పటేల్ మాట్లాడుతూ వేల్పూర్ మండలంలోని మోతే ఉన్నత పాఠశాలలో ఈనెల 12 తేదీ నుండి మూడు రోజుల పాటు జరుగుతున్న మండల స్థాయి క్రీడాల సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ విద్యార్థులకు క్రీడా దుస్తులు అవసరం ఉన్నవి అని అడిగిన వెంటనే మా గ్రూపు సభ్యులు స్పందించి దుస్తులను వితరణ చేయడం జరిగిందని అన్నారు… గతంలో కూడా పాఠశాల అవసరాల నిమిత్తం రూ.5000 ఇవ్వడం జరిగిందని తెలిపారు. మా గ్రూపు సభ్యులు పాఠశాల అభివృద్ధి అవసరాల కొరకు అందుబాటులో ఉంటుందని దీనిని వినియోగించుకొని విద్యార్థులు ఆటల్లో, చదువుల్లో ఉన్నతంగా ఎదిగి ఉన్నతంగా రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.. ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇందుకు సహకరించిన మన ఊరు- మననిది సభ్యులకు పాఠశాల తరపున, విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ పాఠశాల అభివృద్ధికి ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో , మన ఊరు- మన నిధి గ్రూప్ సభ్యులు వల్లం రవి పటేల్,కోల్లే భోజన్న, గోర్తె చక్రపాణి, ఆది మైపాల్, సూర్ నీడ భాస్కర్, బోండ్ల సచిన్, గ్రూపు సభ్యులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.