
మండలంలోని పెద్ద పర్వతాపూర్ గ్రామ లోని శ్రీ సాయి విద్యాధమం పాఠశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ భువనగిరి సెంట్రల్ అధ్యక్షులు గడ్డం జ్ఞానప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిధమం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వామీ శ్రీ రామానంద ప్రభుజీ, శ్రీ సాయి శివ సమితి ట్రస్ట్ ఇన్చార్జి డాక్టర్ జి చంద్రారెడ్డి, హెచ్ఎం జ్యోతి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.