తొర్లికొండ పాఠశాలకు క్రీడా సామాగ్రి వితరణ

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ తొర్లికొండ పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తొర్లికొండ వాస్తవ్యులు జిల్లా బేస్ బాల్ సంఘం అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి మరియు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం మరియు జిల్లా వాలీబాల్ సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేష్ గౌడ్ లు పాఠశాల క్రీడాకారులకు రూ.10,000/- విలువగల క్రీడ సామాగ్రిని అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మరియు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ పాఠశాలలో క్రీడ స్ఫూర్తిని పెంపొందించడానికి పాఠశాల విద్యార్థులకు అవసరమైన క్రీడ సామాగ్రిని ఇవ్వడానికి ఎల్లవేళలా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ మా తొర్లికొండ పాఠశాలకు క్రీడా సామాగ్రిని ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలతో విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సింగారం గంగా జమున, మాజీ ఉపసర్పంచ్ ఈర్ల భూమేష్,పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, నరసింహ, గంగాధర్, సునీత, కృష్ణ, మాలతి మరియు ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ పాల్గొన్నారు.