
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, వారికి చేయూత ఇవ్వడానికి దాతలు ఎప్పుడు ముందుంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత అన్నారు. మండలంలోని కోమనపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల దుస్తులు పంపిణీ జరిగింది. అంకాపూర్ గ్రామానికి చెందిన గడ్డం అనంత్ రెడ్డి 50 జతల ఆటల యూనిఫాం లు విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు క్రీడాభిమాని అయిన అనంతరెడ్డి విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా నైపుణ్యాన్ని కనబరచాలని శారీరక దారుఢ్యం పై శ్రద్ధ చూపాలని విద్యార్థులకు సూచించారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండడం శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమానికి కోకిల నాగరాజు సమన్వయకర్తగా ఉన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత ఉపాధ్యాయులు వినోద్ , జనార్ధన్ వినోద్ ,చిన్నయ్య , గోపాల్ , రాగ సుధ, లక్ష్మి బాయి , అనంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.